//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమిత్ షా ఇంట‌ర్న‌ల్ స‌ర్వే - బీజేపీకి గెలుపా..? ఓట‌మా...?

Category : politics

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చేయించుకున్న కొన్ని అంత‌ర్గ‌త స‌ర్వేలో షాకింగ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. స‌ర్వే ఫ‌లితాల్లో త‌మ పార్టీకి ఓట‌మి ప‌క్కాగా ఖాయ‌మ‌ని అమిత్ షా, మోడీ భావిస్తున్నారు. అంతేకాకుండా, పాత విధానంలోనే మళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్తే ఆ ఓట‌మి శాతం పెరిగే అవకాశం ఉన్నందున, స‌రికొత్త వ్యూహంతో ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని కేంద్రంలోని మోడీ స‌ర్కార్ భావిస్తోంది. అయితే, గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 282 ఎంపీ స్థానాల‌ను గెలుచుకున్న బీజేపీ, ప్ర‌స్తుతం అందులో తొమ్మిది ఎంపీ సీట్లను కోల్పోయింది. ప్ర‌స్తుతం బీజేపీ బ‌లం 273 మాత్ర‌మే.

మోడీ స‌ర్వేలో 272 నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను 152 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త చూపుతున్న‌ట్టు మోడీ స‌ర్వేలో తేలింది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ చాణుక్య‌త‌గ‌ల మోడీ, అమిత్ షాలు మాస్ట‌ర్ ప్లాన్‌కు తెర తీశారంటూ విన‌వ‌స్తోంది. దీంతో ఆయా స్థానాల్లో సిటింగ్ ఎంపీల‌కు కాకుండా, కొత్త వారికి అవ‌కాశం ఇచ్చి విజ‌యం సాధించాల‌ని చూస్తోంది. ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగిన న‌గ‌ర‌పాలిక ఎన్నిక‌ల్లో కొత్త‌వారిని బ‌రిలోకి దింపిన బీజేపీ విజ‌యం సాధించింది. 75 ఏళ్లు నిండిన వారికి బీజేపీ త‌రుపున అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని గ‌తంలో నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ నిబంధ‌న‌నే తొల‌గించేందుకు బీజేపీ నేత‌లు సుముఖ‌త చూపుతున్నారు. ఏదేమైనా అమిత్ షా చేసిన ఈ ఇంట‌ర్నెల్ స‌ర్వేతో బీజేపీ నేత‌ల్లో ఒకింత ఆందోళ‌న నెల‌కొంది.

Related News