//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వ్యోమగామి రాకేశ్‌ శర్మ పాత్రలో అమీర్ ఖాన్ !

Category : national

బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్ నటించిన మహవీర్ ఫోగట్ జీవిత నేపధ్యంతో తెరకెక్కిన దంగల్ చిత్రం దేశ, విదేశాలలో విశేష ప్రసంశలు పొందటం తెలిసిందే. ఇప్పుడు  భారతీయ వ్యోమగామి రాకేశ్‌ శర్మ పాత్రలో అమీర్ మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తున్నది.  

1984 ఏప్రియల్‌ 3న రష్యాకు చెందిన సోయజ్‌ టి- 11 ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాడు రాకేశ్‌ శర్మ. ఆయన చేసిన సాహసాన్ని భారతీయులకు కళ్ళకు గట్టినట్టు చూపించాలని అమీర్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఒక వేళ ఇదే కనుక నిజమైతే తొలి బాలీవుడ్‌ స్పేస్ మూవీగా ఈ చిత్రం చరిత్ర సృష్టించ గలదు. 

రాకేష్ శర్మను నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. 'అంతరిక్షం నుంచి చూస్తే భారతదేశం ఎలా ఉంది? అని అడిగిన ప్రశ్నకు. 'సారే జహాసే అచ్ఛా..' అని సమాధానమిచ్చాడట. అందుకే అదే టైటిల్ ని తన సినిమాకి ఫిక్స్ చేశాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో క‌థానాయిక‌గా దంగ‌ల్ ఫేం ఫాతిమా సనా షేక్ న‌టించ‌నుంద‌ని వినికిడి. 

సారే జహాసే అచ్ఛా మూవీని మ‌హేష్ మ‌ఠాయ్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. అమీర్ ఖాన్ , రొన్నీ స్క్రూవాలా,సిద్ధార్ధ రాయ్ క‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ట‌. అయితే సెల్యూట్ అనే టైటిల్ కూడా ఈ సినిమాకి పెట్టొచ్చ‌నే భావ‌న‌లో నిర్మాత‌లు ఉన్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.