సెప్టెంబర్ 23, 24 తేదీలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి ప్రాంతంలో 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుపుతున్నారు. బయట నుండి వచ్చే వారికి అతి తక్కువ ఖరీదులో వసతి ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక డాల్లస్ ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ కి, అక్కడ నుంచి సభాస్థలికి ఉచితంగా షటిల్ సర్వీసు ఏర్పాటు చేస్తు వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, రాజధాని ప్రాంత తెలుగు సంఘం సంచాలకులు వంగూరి చిట్టెన్ రాజు, భాస్కర్ బొమ్మారెడ్డి తెలిపారు.
సదస్సు ప్రవేశ రుసుము ఒక్కొక్క వ్యక్ 50 డాలర్లు. ప్రతినిధులు అందరికీ రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం కాఫీ, ఫలహారాలు, మధ్యాహ్నం విందు భోజనం, ఈ సదస్సు సందర్భంగా ముద్రించబడి సదస్సులో విడుదల అయ్యే కనీసం మూడు పుస్తకాలు (అమెరికా తెలుగు కథానిక -13వ సంకలనం తో సహా, సుధేష్ణ సోమ గారి నవల 'నర్తకి' తో సహా..) ఏర్పాటు చేస్తున్నారు.
భారత దేశం నుంచి తనికెళ్ళ భరణి, కవి జొన్నవిత్తుల, అచ్చ తెనుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఖదీర్ బాబు, ద్వానా శాస్త్రి, దాసరి అమరేంద్ర, కన్నెగంటి అనసూయ మొదలైన లభ్దప్రతిష్టులైన రచయితలు ఈ సదస్సులో ఆత్మీయ అతిధులుగా పాల్గొననున్నారు. ఇక ఉత్తర అమెరికా నుంచి సుమారు 15 మంది పేరుగాంచిన సాహితీవేత్తలను ఆహ్వానించారు. మరిన్ని వివరాలకు vangurifoundation@gmail.com ను సంప్రదించవచ్చు.