//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికా సెక్స్ రాకెట్.. ఇంట‌ర్‌నేష‌న‌ల్ మీడియా చేతిలో.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల భాగోతం..!

Category : movies

టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న అమెరికా సెక్స్ రాకెట్ ఇష్యూకి సంబంధించి తాజా వార్త సినీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని చికాగోలో స్టార్ హీరోయిన్ల‌తో సెక్స్ రాకెట్ న‌డుపుతున్న తెలుగు సినీ నిర్మాత మోదుగుమూడి కిషన్, అతడి భార్య చంద్ర ల‌ను అక్క‌డి ఏజెన్సీ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో భాగంగా కొన్ని షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌గా తాజాగా మ‌రో వార్త సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే తాజాగా శ్రీరెడ్డి త‌న షోష‌ల్ మీడియాలో పేజ్‌లో పెట్టిన పోస్టు సినీ వ‌ర్గాల్లో మ‌రోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్ర‌స్తుతం సంచ‌ల‌నం సృష్టిస్తున్న అమెరికా సెక్స్ రాకెట్ కేసులో టాలీవుడ్ పెద్ద‌ హీరోయిన్లు, చిన్న హీరోయిన్లు, యాంక‌ర్ల లిస్టు త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని.. వాటిని త్వ‌ర‌లోనే ఇంగ్లీష్ మీడియాకి అందిస్తాన‌ని.. చాలా మంది భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తాన‌ని శ్రీరెడ్డి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టింది. ఇక అంతే కాకుండా ఆ సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్న వారిలో ఒక అమ్మాయి.. తెలుగులో సాయిధ‌రం తేజ్‌తో రెండు మూడు సినిమాలు చేసింద‌ని.. చిన్న హింట్ కూడా ఇచ్చింది శ్రీరెడ్డి. దీంతో మ‌రోసారి టాలీవుడ్ స్టార్స్‌ను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. వ‌ర్మ ఇష్యూ త‌ర్వాత కామ్ అయిన శ్రీరెడ్డి ఈ సెక్స్ రాకెట్ ఉదంతం బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌రోసారి ర‌చ్చ మొద‌లు పెట్టింది శ్రీరెడ్డి.