//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్‌కు డ్రోన్ల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా

Category : national

భారత్‌కు 22 మానవ రహిత గార్డియన్ డ్రోన్ విమానాల అమ్మకానికి అమెరికా పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కాబోతున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం భారత్ పట్ల అమెరికా సానుకూల ధోరణిని సూచిస్తున్నదని పరిశలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం విలువ రెండు నుంచి మూడు బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.13,600-20,400 కోట్లు) ఉంటుందని అమెరికా అధికారవర్గాలు తెలిపాయి.

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విదేశాంగ శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని, భారత్‌కు, తయారీదారుకు ఈ మేరకు సందేశాలు వెళ్లాయని ఓ అధికారి చెప్పారు. చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలను పసిగట్టేందుకు గార్డియన్ డ్రోన్లు ఉపయోగపడుతాయని అంటున్నారు. భారత్, అమెరికా రక్షణ సంబంధాలలో భాగంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 22 నిరాయుధ డ్రోన్ల కొనుగోలుపై ఉభయ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

Related News