//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టెస్టుకి రానందుకు...స్టార్ క్రికెటర్ పై వేటు...

Category : sports

ఇండియా అంటే క్రికెట్ అని అందరికి తెలుసు...ఈ టీం దేశానికీ ఓ గొప్ప కిరణాలూ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇండియా టీంలో ధావన్,రోహిత్ శర్మ తర్వాత అంతటి ఘనత బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుపై మరోసారి సెలక్టర్లు వేటు వేశారు.

గత నెలలో బెంగళూరు వేదికగా జరిగిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలై భారత జట్టులో చోటు కోల్పోయిన అంబటి రాయుడు.. తాజాగా ఆ టెస్టుకి గైర్హాజరైన కారణంగా భారత-ఎ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున 2018 ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రాయుడిని ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టులోకి గత మే నెలలో సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. ఈ పర్యటన ముందు నిర్వహించిన యో-యో టెస్టులో ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో.. జట్టు నుంచి తప్పించి సురేశ్ రైనాకి అవకాశం కల్పించారు. ఆ సమయంలోనే ఆరు వారాల్లోపు మరోసారి ఫిట్‌నెస్ టెస్టు‌కి హాజరవ్వాలని బీసీసీఐ ఆదేశించింది. కానీ.. తాజాగా రాయుడు యో-యో టెస్టుకి గైర్హాజరవడంతో అతడ్ని భారత-ఎ జట్టుతో పాటు దిలీప్ ట్రోఫీ జట్లలోనూ స్థానంలో కల్పించలేదు.

గత ఏడాదితో పోలిస్తే యో-యో ఫిట్‌నెస్ టెస్టుని ఇటీవల బీసీసీఐ కఠినతరం చేసింది. భారత్ తరఫున ఆడాలంటే క్రికెటర్ కచ్చితంగా ఈ టెస్టుని పాసవ్వాలని ఆదేశించిన బీసీసీఐ.. కనీసం మార్కులు 16.1 రావాలని నిబంధనని విధించింది. యో-యో టెస్టుకి హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని అంబటి రాయుడు బీసీసీఐ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.అస్సలేం జరీరింది అని అందరు ఆలోచనలో పడ్డారు..