రండి రండి అంటూ అమెజాన్ అద్భుతమైన ప్రైమ్ డే సేల్ని పెంచనుంది..దానికోసం ఈ- కామర్స్ దిగ్గజం ఏటా నిర్వహించే అమెజాన్ ప్రైమ్డే సేల్ సోమవారం ప్రారంభమవుతున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఇది కొనసాగుతుంది.
36 గంటలపాటు కొనసాగే ఈ ప్రైమ్డే సేల్లో వినియోగదారులకు ఎన్నో ఆఫర్లు లభించబోతున్నాయి. మొత్తం 17 దేశాలలో అమెజాన్ ప్రైమ్డే సేల్ కొనసాగుతుంది. మనదేశంలో గత ఏడాది దీనిని ప్రారంభించారు. ఈ ఏడాది రెండవసారి దీనిని కొనసాగించబోతున్నారు.
సాధారణంగా లభించే అనేక వస్తువులతోపాటు అమెజాన్ ప్రైమ్డే సేల్లో కొన్ని కొత్త వస్తువులను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. గత ఏడాది 34 కొత్త వస్తువులను ఈ సేల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది 200 కొత్త వస్తువులు లభించబోతున్నాయి.అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి మాత్రమే అమెజాన్ ప్రైమ్డే సేల్లో వస్తువులు కొనే అవకాశం లభిస్తుంది. అమెజాన్లో మొత్తం 17కోట్ల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మంది అమెజాన్ ప్రైమ్ మెంబర్లుగా ఉన్నారు. ఏడాదికి రూ.999 చెల్లించి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు.
ఇప్పుడు కొత్తగా నెలకు రూ.129 చెల్లించి ఈ సభ్యత్వం పొందే అవకాశం కూడా కల్పించారు. పెద్ద నగరాలలో కేవలం రెండు గంటలలో, ఇతర చోట్ల ఒకటి, రెండు రోజులలో వస్తువుల డెలివరీ జరుపుతారు. అమెజాన్ ప్రైమ్డే సందర్భంగా భారీ డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారు. కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు, అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపేవారికి అదనపు డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.త్వరపడండి అంటున్నారు అమెజాన్...