డెవలప్ మెంటుకై ఒక్కటైన NSDC,అమెజాన్ ఇండియా నేషనల్ స్కిల్ డెవలప్ మెంటు కార్పొరేషన్(NSDC)అమెజాన్ సంస్థలు నాగాలాండ్ మహిళలకు కంప్యూటర్ విద్య,ఆన్ లైన్ మార్కెటింగ్ ఫై శిక్షణ ఇచ్చేనందుకు ఒక్కటయ్యారు.ఈ శిక్షణతో నాగాలాండ్ మహిళలు వారు తాయారు చేసిన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోటానికి వెసులుబాటు కలుగుతుందని స్కిల్ డెవలప్ మెంటు అండ్ ఆంత్రప్రెన్యూర్ షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు.రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిక్త సమాధానమిచ్చారు.అమెజాన్ సంస్థ ప్రారంభించిన సహేలి ప్రాజెక్టు మహిళలకు సాధికారత నిచ్చేందుకు ఉద్దేశించబడింది.మహిళలు అమెజాన్ ప్లాట్ ఫామ్ ను ఉపయోగేంచి వారు తాయారు చేసిన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించి అమ్ముకోటానికి అమెజాన్ ప్రత్యేకంగా రూపొందించిన టూల్స్ ఫై వారికి శిక్షణ నిస్తారని రూడీ తెలిపారు.