విజయదశమి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల పాటు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో మొత్తం 40 వేలకు రకాలకు పైగా వస్తువులపై ఈ ఆఫర్లు కొనసాగుతాయి. అందులో ఎలక్ట్రానిక్స్‌పై 2500కు పైగా ఆఫర్లు, స్మార్ట్ఫోన్లపై 500కుపైగా ఆఫర్లు ఉన్నాయి. హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఐటమ్స్లను కూడా డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ప్రముఖ కంపెనీలు అయిన ఆపిల్, సామ్సంగ్, వన్‌ప్లస్, లెనోవో వంటి మొబైల్ ఉత్పత్తుల కంపెనీల నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చని పేర్కొంది. అంతేగాక, అమెజాన్ పే, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌తో కొనుగోలు చేసేవారికి 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.