అదిరిపోయే ఆఫర్లతో ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు వినియోగదారులకు ఆఫర్ సేల్‌ను అందిస్తోంది. అమెజాన్ ప్రైజ్ యూజర్లకు ఈ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్‌పై 60 శాతం వరకు, ఫ్యాషన్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. దీనికి తోడు సులభ వాయిదాలో పద్ధతిలో చెల్లించడానికి ‘నో కాస్ట్ ఈఎంఐ’ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. అంటే క్రెడిట్ కార్డు ఉన్నవారు ఎలాంటి వడ్డీ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో అమెజాన్‌లో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ఐఫోన్, లెనొవొ, వన్‌ప్లస్, సామ్సంగ్, హానర్, ఎంఐ, ఎల్జీ, మోటోరోలా, కూల్‌ప్యాడ్, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్, నోకియా బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, మైక్రోఓవెన్లు, కెమెరాలు, మిక్సర్ గ్రైండర్లు, ఐరన్ బాక్సులు, స్టోరేజ్ డివైజ్‌లు, పవర్ బ్యాంకులు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ వంటి ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్‌పై కూడా 60 శాతం వరకు డిస్కౌంట్ పొందే వీలుంది. ఇక ప్రైమ్ యూజర్లయితే ఎంపికచేసిన టీవీలు, అప్లయన్సెస్ కొనుగోలు చేసినప్పుడు ‘అమెజాన్ పే’ నుంచి చెల్లిస్తే అదనంగా రూ. 500 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దుస్తులు, షూస్, యాక్ససరీస్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ పొందే వీలుంది. దుస్తులు, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, సన్‌గ్లాసెస్, జువలెరీ, కిడ్స్ ఫ్యాషన్, లగేజ్ ట్రాలీస్పై అత్యధికంగా 70 శాతం డిస్కౌంట్లు ఉన్నాయి. ఇక వాచీలపై 60 శాతం వరకు ధరలను తగ్గించారు.