ఈ -కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్డ్ , అమెజాన్ లు మరోసారి ధరల యుద్దంతో భారీ ఆఫర్లకు తెరతీయనున్నాయి. ఈ ఆఫర్ల యుద్దంలో వినియోగదారులకు ప్రయోజనం కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పదో వార్షికోత్సవం సందర్బంగా ఈనెల 14 నుంచి 18 వరకు 5 రోజులపాటు బిగ్10 సేల్ పేరుతో ఫ్లిప్కార్ట్ ముఖ్యమైన బ్రాండ్లపై ఏకంగా 80 శాతం రాయితీ ప్రకటించింది.మరో వైపు ఈ నెల 11నుండి 14 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ల పండుగ ప్రారంభించింది. వినియోగదారులు ఇటీవలకాలంలో ఆన్ లైన్ లో కొనుగోళ్ళకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు.అయితే ఈ కామర్స్ దిగ్గజాలు వినియోగదారులకు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. ఆన్ లైన్ ద్వార కొనుగోళ్ళ అవకాశం వినియోగదారులకు అందుబాటులోకి రావడంతో వినియోగదారులను ఆకట్టుకొనేందుకుగాను ఆయా ఈ కామర్స్ సంస్థలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. అయితే ఈ పోటీలో ప్రత్యర్థులకు అవకాశం లేకుండా చేసేందుకుగాను ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.