//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అమెజాన్‌ అధినేత జెఫ్‌ .. జాబితాలో వివరాలివి

Category : world

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ లిస్ట్ ను విడుదల చేసింది. దీంట్లో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ఆస్తి 2018 కంటే 1900 కోట్ల డాలర్లు మేర పెరిగి 13100 కోట్ల డాలర్ల (రూ. 9లక్షల కోట్లు) పైకి చేరింది. దీంతో మరోసారి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం. రెండో స్థానంలో బిల్‌ గేట్స్‌ 9650 కోట్ల డాలర్లతో ఉన్నారు , వారెన్‌ బఫెట్‌ 8250 కోట్ల డాలర్లతోమూడో స్థానంలో నిలిచారు .ముకేశ్‌ అంబానీ 13వ స్థానాన్ని సంపాదించుకున్నారు.

2018 సంవత్సరంతో పోలిస్తే..అంబానీ 6 స్థానాలు బెటర్ చేసుకోవటం విశేషం.ముకేశ్‌ అంబానీ సంపద 2018లో 4010 కోట్ల డాలర్లు కాగా..దాని నుంచి పెరిగి 5000 కోట్ల డాలర్లకు అంటే ఇండియన్ కరెన్సీ రూ.3.5 లక్షల కోట్లకు చేరింది. 2017లో ముకేశ్‌ అంబానీ 37వ స్థానంలో ఉండగా..2018లో 19వ స్థానానికి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నారు. 2019తో మరో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరారు. ప్రపంచవ్యాప్తంగా కుబేరులతో ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది. 2019 ఫిబ్రవరి చివరినాటికి ఉన్న మారకపు రేట్లు, షేర్ల ధరలు ఆధారంగా నికర సంపదను ఫోర్బ్స్‌ లెక్కించింది.

ఫోర్బ్స్‌ రూపొందించిన కుబేరుల జాబితాలో నలుగురు తెలుగువారికి చోటు లభించింది. దివీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకుడు మురళీ దివి 3.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో 645వ ర్యాంకు పొందారు. అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పి.వి.రామ్‌ప్రసాద్‌ రెడ్డికి 804వ ర్యాంకు లభించింది. ఆయన నికర సంపద 2.8 బిలియన్‌ డాలర్లు. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యవస్థాపకుడు పి.పి.రెడ్డి (1008 ర్యాంకు), ఎండీ పి.వి.కృష్ణారెడ్డి (1057 ర్యాంకు) కూడా జాబితాలో చోటు సంపాదించారు. వీరిద్దరి నికర సంపద వరుసగా 2.3 బిలియన్‌ డాలర్లు, 2.2 బిలియన్‌ డాలర్లు.