//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పుట్టీ పుట్టగానే నడుస్తున్న బేబీ.

Category : national

కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని అసాధారణ శక్తులు కలిగి ఉంటారంటా, అప్పుడే పుట్టిన పసిపాప ల్యాప్ టాప్ ఆన్ చేసి సందడి చేసిన యాడ్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో పాప ఇలాంటి అద్భుతాన్నే చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది.'అమేజింగ్ న్యూ బోర్న్ బేబీ వీడియో' ఒకటి ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఆ పసిపాప పుట్టీ పుట్టగానే డాక్టర్ చేయి పట్టుకుని హాస్పిటల్ బెడ్ పై బుడి బుడి అడుగులేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ పాప ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ ఏ ఆసుపత్రిలో జన్మించింది? ఈ వివరాలేవీ ప్రస్తుతానికి ఏమి తెలియదు ఉన్నదల్లా ఆ పసిపాప డాక్టర్ చేయి పట్టుకుని చకచకా నడుస్తున్న వీడియో మాత్రమే.