//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మేడాకు టికెట్ ఇస్తే వైసీపీ ఓడిపోతుంది.. అమర్నాథ్ రెడ్డి షాకింగ్ కామెంట్

Category : politics state

ఏపీ రాజకీయాల్లో రాజంపేట పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడేక్కాయి. ఇక వైసీపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు మల్లికార్జున్ రెడ్డి చేరిక వేదిక కానుంది. టీడీపీని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో కేటీఆర్ వ్యూహంలో భాగంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న మేడా సోదరులు వైసీపీలో జాక్ పాట్ కొట్టారని టాక్ వినిపిస్తోంది. టిడిపి నుండి మేడా జంప్ అవ్వడానికి కారణం కూడా ఇదే అని ప్రచారం జరుగుతోంది.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో ఇది నుండి గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధికి పని చేశారు మల్లికార్జున్ రెడ్డి. ఇక జిల్లాలో టిడిపి నుండి గెలిచిన ఒకే ఒక్క నేత కావడంతో పార్టీలో ఆయనకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఇక మేడ తండ్రికి సైతం టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశమిచ్చిన చంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా నిధులను బాగానే కేటాయించారు. అంతటి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ మల్లికార్జున్ రెడ్డి కేవలం పదవుల కోసం టిడిపిని వీడి వైసీపీ బాట పట్టారు. ఇక ఆయన ఎంట్రీతో వైసీపీలను రాజకీయ సమీకరణాలు మారాయి. రాజంపేట నుండి క‌డ‌ప జిల్లా వైసిపి అధ్య‌క్షుడు ఆకేపాటి అమ‌ర్నాధ‌రెడ్డి ఎమ్మెల్యే సీటు కోసం పోటీ లో ఉన్నారు. మొదటి నుండి జగన్ ఆయనకి ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి చేరికతో ఇప్పుడు వైసిపి లో టెన్షన్ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా మల్లికార్జున్ రెడ్డి టికెట్ ఆశించి పార్టీలో చేరి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

రాజంపేట టికెట్ విషయంలో వైసీపీ అధినేత జగన్.. తనకు అన్యాయం చేయరని ఆ పార్టీ నేత ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం రాజంపేటలోని ఓ కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాగా.. రాజంపేట టికెట్ అమరనాథ్ రెడ్డికి కాకుండా ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మేడా ఇస్తారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

దీనిపై తాజాగా మరోసారి అమరనాథ్ రెడ్డి స్పందించారు. కొన్ని సంవత్సరాలుగా తాను పార్టీ కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. పూటకో పార్టీ మారే మేడా మల్లికార్జునరెడ్డి కి టికెట్ కేటాయిస్తే.. రాజంపేటలో వైసీపీ ఓడిపోతుందన్నారు. తనకు జగన్ అన్యాయం చేయరనే నమ్మకం ఉందంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న ఆయనను కార్యకర్తలు సముదాయించారు.అమర్ నాథ్ రెడ్డికి కాకుండా.. మేడాకి టికెట్ ఇస్తే.. తామంతా నిరాహార దీక్ష చేస్తామంటూ కార్యకర్తలు హెచ్చరించడం గమనార్హం. మొత్తానికి ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Related News