Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడే ఫైనల్ టచ్ : అధికారిక ప్రకటన

Category : national

అమరావతి అసెంబ్లీ డిజైన్‌పై నేడు అధికారిక ప్రకటన రానుంది.

ఇప్పటికే టవర్‌ డిజైన్‌ను సీఎం చంద్రబాబు ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. పబ్లిక్‌ పోల్ కోసం ఉంచిన డిజైన్లలో టవర్‌ మోడల్‌కే ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఇక అధికారిక ప్రకటనే తరువాయి.

నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన టవర్‌, డైమండ్‌ ఆకృతుల్లో టవర్ డిజైన్‌కే సీఎం చంద్రబాబు సహా మంత్రులు, సీఆర్డీఏ అధికారులు ఓకే చెప్పారు. పబ్లిక్‌ డొమైన్‌లోనూ టవర్‌ డిజైన్‌కే ప్రజలు ఓటేశారు. పబ్లిక్‌ డొమైన్‌లో 24 వేల 905 మంది ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వగా.. ఇందులో 15 వేల 85 మంది టవర్‌ డిజైన్‌కు ... 7 వేల 817 మంది డైమండ్ డిజైన్‌కు అనుకూలంగా ఓటేశారు. అంటే.. టవర్ డిజైన్‌కు 68 శాతం పట్టంకట్టారన్నమాట.

ఈ అంశాలన్నీ కేబినెట్‌ భేటీలో సీఎం మంత్రులతో చర్చించి.. ఇదే డిజైన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. వీటితో బాటుగా అటు.. అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. మరోవైపు... అసెంబ్లీ కోసం రూపొందించిన రెండు డిజైన్లు, హైకోర్టు కోసం రూపొందించిన డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రత్యేక ఏర్పాట్ల మధ్య సీఎం చంద్రబాబుకు వివరించింది. చంద్రబాబు లండన్‌ వెళ్లినప్పుడే అసెంబ్లీ కోసం రెండు డిజైన్లను ఫైనల్ చేశారు. వాటిలో కొన్ని సూచనలు ఇచ్చి.. మార్పులు చేసుకురావాలని కోరారు.

మార్పు చేసిన డిజైన్లను బుధవారం సంస్థ ప్రతినిధులు సీఎంకు చూపించడం.. సీఎం పబ్లిక్ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని ఆదేశించడం.. పబ్లిక్‌ టవర్‌ డిజైన్‌కే పట్టం కట్టడం చకచకా జరిగిపోయింది. ఇప్పుడు ఖరారు చేయన్నున నమూనా అమరావతికే తలమానికంగా ఉండబోతోంది . 250 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న ఐకానిక్ టవర్‌లో.. 40 మీటర్ల ఎత్తులో గ్యాలరీ ఉంటుంది. కేపిటల్‌ సిటీ 217 చదరపు కిలోమీటర్లను గ్యాలరీ నుంచి ప్రజలు చూసేలా దీన్ని డిజైన్ చేశారు.

హైకోర్టు కోసం ఇప్పటికే బౌద్ధ స్థూపాకారపు డిజైన్‌ను ఆమోదించారు. దీన్ని మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు.. డిజైన్‌కు మరికొన్ని హంగులు చేర్చనున్నారు. రెండుమూడు రోజుల్లో ఈ డిజైన్‌పైనా అధికారిక ప్రకటన రానుంది.