Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమర్ అక్బర్‌ ఆంటోని రివ్యూ

Category : movies

హీరో : రవితేజ

హీరోయిన్ : ఇలియానా

తారాగ‌ణం: ర‌వితేజ‌, ఇలియానా, సునీల్‌, ల‌య‌, వెన్నెల‌కిషోర్‌ , తదితరులు

నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్‌(సి.వి.ఎం)

ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీనువైట్ల‌ .

తనదైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న మాస్ మహారాజ్ ర‌వితేజ‌. మాస్ ఇమేజ్ ఉన్న ఈ హీరో వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ర‌వితేజ‌, శ్రీనువైట్ల అంటే ఇప్ప‌టికే మూడు హిట్స్ ఉన్నాయి. అయితే ఈ మ‌ధ్య శ్రీనువైట్ల‌కు స‌రైన హిట్స్ లేవు. న‌మ్మ‌కంతో శ్రీనువైట్ల‌కు మ‌రో అవ‌కాశం ఇచ్చాడు ర‌వితేజ‌. మ‌రి ర‌వితేజ‌, శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన నాలుగో చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. దాదాపు ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత ఈమె తెలుగులో చేసిన సినిమా. మ‌రి అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ఎలా ఉందొ చూద్దాం పదండి .....Amar Akbar Anthony Movie review

క‌థ‌:

ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్‌ ప్రసాద్‌ తన కొడుకు అమర్‌ (రవితేజ)ను, సంజయ్‌ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా(తరుణ్‌ అరోరా), సబూ మీనన్‌ (ఆదిత్య మీనన్‌), విక్రమ్‌ తల్వార్‌ (విక్రమ్‌జీత్‌) , రాజ్‌ వీర్‌ల నిజస్వరూపం తెలియని ఆనంద్‌, సంజయ్‌లు కంపెనీలో 20 శాతం షేర్స్‌ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. పార్టనర్స్‌ అయిన వెంటనే ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు ఆ నలుగురు. కానీ వారి కుటుంబానికి నమ్మకస్తుడైన జలాల్‌ అక్బర్‌(షాయాజీ షిండే) సాయంతో అమర్‌, ఐశ్వర్యలు తప్పించుకుంటారు. తప్పించుకున్న అమర్‌ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు.? తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్‌, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ఈ కథలో అక్బర్‌, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ.

ప్ల‌స్ పాయింట్స్‌ .....

సినిమాటోగ్ర‌ఫీ

నిర్మాణ విలువలు

కొన్ని కొన్ని పార్టుల్లో కామెడీ బాగా ఉంది.

మైన‌స్ పాయింట్స్‌.....

క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం

రెగ్యుల‌ర్ ర‌వితేజ‌, శ్రీనువైట్ల సినిమాలా లేదు

సంగీతం, నేప‌థ్య సంగీతం

ఆస‌క్తిక‌రంగా లేని స్క్రీన్‌ప్లే

నటీనటులు ;

రవితేజ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అమర్‌ పాత్రలో రవితేజ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. అక్బర్‌, ఆంటొనీల పాత్రల్లో కామెడీ కొంతమేరకు వర్క్‌ అవుట్‌ అయినా సహజంగా అనిపించదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇలియాన నటన అలరిస్తుంది. కాస్త బొద్దుగా కనిపించినా పర్ఫామెన్స్‌తో పాటు గ్లామర్‌తోనూ మెప్పిస్తుంది. తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్‌, విక్రమ్‌జీత్‌ విర్క్‌ స్టైలిష్‌ విలన్లుగా కనిపించారు. విలక్షణ నటుడు షాయాజీ షిండేకు చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర దక్కింది. జలాల్‌ అక్బర్ పాత్రలో ఆయన నటన బాగుంది. ఇక తెలుగులో టాప్‌ కామెడియన్స్‌గా కొనసాగుతున్న వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్‌ రెడ్డిలతో పాటు తిరిగి కామెడీ పాత్రలు చేస్తున్న సునీల్‌లు కొంత మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. సత్య, రఘుబాబు, గిరి, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌ రెడ్డి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ ;

చాలా రోజులుగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు శ్రీను వైట్ల ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఓ మామూలు రివేంజ్‌ డ్రామా కథకు న్యూయార్క్‌ బ్యాక్‌ డ్రాప్‌ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు. అక్కడక్కడా కామెడీ పరవాలేదనిపించినా పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేదు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా చాలా సన్నివేశంలో కామెడీ కావాలని ఇరికించారన్న భావన కలుగుతుంది. తమన్‌ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాకు మేజర్ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా, అందంగా, లావిష్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడుకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు.

బాటమ్ లైన్ : కన్ఫ్యూషన్ కామెడీ ...

రివ్యూ / రేటింగ్ ; 2 .5 / 5

Related News