//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అల్లు శిరీష్ ఎబిసీడీ సినిమా టైల‌ర్ రివ్యూ ...?

Category : movies

అల్లు శిరీష్ హీరోగా ,సంజీవ‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో,మ‌ధుర శ్రీ‌ధ‌ర్ రెడ్డి ,య‌ష్ ల నిర్మాణంలో ,సురేష్ ప్రోడ‌క్ష‌న్ వారు స‌మ‌ర్పిస్తున్న సినిమా ఏబిసీడీ...మ‌ళ‌యాలం నుండి తెలుగు రీమేక్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ టైల‌ర్ తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది .అయితే ఈ టైల‌ర్ రివ్యూ విష‌యానికి వ‌స్తే .....అల్లు శిరీష్ లుక్స్ చాలా భాగుండ‌డంతో పాటు అల్లు శిరీష్ చెప్పే డైలాగ్ లు కూడా యూత్ ను ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి .

ఇందులో వివిధ పాత్ర‌ల‌లో న‌టించిన న‌టుల సంభాష‌ణ‌లు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయ‌నే చెప్పాలి .ఇందులో న‌టించిన హీరోయిన్ రుక్సార్ గ్ల‌మర్ ఈసినిమాకు ప్లెస్ అయ్యే చాన్సుంది .టైల‌ర్ లో అల్లు శిరీష్ పాత్ర విష‌యానికి వ‌స్తే అమెరికాలో ల‌గ్స‌రీ లైఫ్ గ‌డిపి ,ఇండియాలో పెద‌రికం అనుభ‌విస్తూ త‌న దైనా స్టైల్ లో కామెడిని పండిస్తూ కేక పుట్టించాడ‌ని అన‌డంలో ఏ మాత్రం సందేహం లేద‌నే అనాలి .ఇక అత‌ని ప‌క్క‌న స్నేహితునిగా ఉన్న మాస్ట‌ర్ భ‌ర‌త్ విష‌యానికి వ‌స్తే భ‌ర‌త్ త‌న మార్క్ కామెడిని పండిచాడ‌నే చెప్పాలి .

మొత్తం మీద ఈ సినిమా టైల‌ర్ చూస్తుంటే యాక్ష‌న్ అండ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన‌ట్లు క‌న‌బ‌డుతుంది .ఇందులో మాట‌లు చూస్తుంటే ర‌చ‌యిత ఎక్కువ‌గా బాడీ లాంగ్వేజికి త‌గ్గ డైలాగ్ రాసి మంచి మార్క‌లే కొట్టాసేడాని తెలుస్తుంది .ఇక నాగ‌బాబు విష‌యానికి వ‌స్తే సంప‌న్నుని పాత్ర‌లో న‌టిస్తూ ,కోడుకుకు డ‌బ్బు విలువ తెలిపే పాత్ర‌ను చేస్తున్న‌ట్లు అనిపిస్తుంది .అయితే తెర‌పై క‌నిపించిన పాత్ర‌ల‌ను చూసుకుంటే ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా కామెడీ మీద ఆధార‌ప‌డిన‌ట్లు తెలుస్తుంది .