//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మలయాళం మార్కెట్ పై కన్నేసిన స్టైలిష్ స్టార్.... అందుకోసమే ఆ సీనియర్ నటున్ని తీసుకున్నారట.

Category : movies

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా ఓ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందన్న విషయం తెలిసిందే. అందు లో భాగంగానే ఈసినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే మరోమారు జత కట్ట బోతోంది . డీజే తరువాత ఈ ఇద్దరు కలిసి నటిస్తూ ఉండడంతో ఈ జోడీ పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ 'టబు' నటిస్తూ ఉండడం విశేషం. ఇక బన్నీ తండ్రి పాత్ర కోసం మరో కీలక నటుడిని తీసుకోనున్నారట.ఇందు కోసం ఏకంగా ఓ మలయాళ దిగ్గజా నటుడిని లైన్ లో పెట్టాడు త్రివిక్రమ్.

ఈ పాత్ర కోసం చాలా మంది సీనియర్ హీరోల పేర్లను పరిశీలించిన పిమ్మట, మలయాళ నటుడు 'జయరామ్' ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో జయరామ్ కి మంచి క్రేజ్ వుంది. నటుడిగా సుదీర్ఘకాల ప్రయాణం తరువాత ఆయన చేస్తోన్న తెలుగు సినిమా ఇదే. అంతే కాకుండా ఈ నటుడు రీసెంట్ గా అనుష్క లీడ్ రోల్ లో నటించిన భాగమతి సినిమాలోనూ విలన్ గా మెప్పించాడు. కొత్తదనం కోసమే ఆయనను ఈ సినిమాలో తీసుకొనున్నట్టు ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.అంతే కాకుండా బన్నీ కి మలయాళం లో ఉన్న మార్కెట్ నీ ప్లస్ చేసుకునే విధంగా ఈ సినిమాలో నటుడు జయరామ్ నీ తీసుకుంటున్నారని మరో టాక్.తల్లి పాత్ర వైపు నుంచి 'అలకనంద' .. తండ్రి పాత్ర వైపు నుంచి 'నాన్న - నేను' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారనీ సమాచారం.ఈ రెండు టైటిల్స్ లో ఏది ఫైనల్ చేస్తారనేది చూడాలి.