//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ‌న్నీ నెక్స్ట్ మూవీ డైరెక్ట‌ర్ అత‌నే..!

Category : movies

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్‌పై ఎట్ట‌కేల‌కు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. బ‌న్నీ రీసెంట్‌గా న‌టించిన నా పేరు సూర్య చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టిన విష‌యం తెలిసిందే. దాంతో త‌రువాత సినిమా ఎవ‌రితో చేయాల‌న్న దానిపై కొద్ది కాలంగా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

కొత్త డైరెక్ట‌ర్స్ త‌న‌ను ఇంప్రెస్ చేసే క‌థలేమీ చెప్ప‌క‌పోవ‌డం, పెద్ద డైరెక్ట‌ర్లంతా బిజీ బిజీగా ఉండ‌టంతో అల్లు అర్జున్ త‌న త‌రువాతి సినిమాకు ఇంత వ‌ర‌కు కొబ్బ‌రి కాయ కొట్ట‌లేదు. కొత్త సినిమాపై డైల‌మాలో ఉన్న అల్లు అర్జున్ త‌న త‌రువాతి సినిమాను పెద్ద డైరెక్ట‌ర్‌తోనే తీయాల‌ని డిసైడ‌య్యార‌ట‌. అందులో భాగంగా ఇప్ప‌టికే విక్ర‌మ్ కే కుమార్‌తోపాటు, త్రివిక్ర‌మ్, సురేంద‌ర్‌రెడ్డిల‌ను లైన్లో పెట్టాడ‌ని, వీరి ముగ్గురిలో విక్ర‌మ్ కే కుమార్ తెర‌కెక్కించే సినిమాలో బ‌న్నీ హీరోగా న‌టించ‌నున్నారు.