Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అల్లు అర్జున్ హీరోయిన్ ని సింగర్ గా మారుస్తున్న తమన్

Category : movies

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన గ్యాప్ లేకుండా నటిస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది పూజా హెగ్డే మాత్రమే అని చెప్పాలి. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య, ఇలా వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తుంది పూజ రెండోసారి ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో నటిస్తుంది. తన అభినయంతో ఆకట్టుకునే పూజ హెగ్డే తెరపై డాన్స్ లే కాకుండా తెర వెనకాల పాటలు పాడటానికి కూడా సిద్ధమైపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హ్యాట్రిక్ చిత్రం చెయ్యబోతున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు .దాంతో తమన్ సంగీతం లో ఈ భామ కూని రాగాలు తీయడానికి గొంతు సవరించుకుంటోంది . పూజా హెగ్డే కు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమట, దాంతో ఈ చిత్రంలో ఓ పాట పాడాలని ఉందని తమన్ చెవిలో వేసిందట ! ఇంకేముంది తమన్ పూజా హెగ్డే ని సింగర్ గా మార్చడానికి తగు సలహాలు సూచనలు ఇస్తున్నాడట . దాంతో ఈ సినిమాలో ఓ పాట పాడటం ఖాయమని తెలుస్తోంది. సినిమా హీరోయిన్లు పాటలు పాడటం కొత్త కానప్పటికీ పాటలు పాడుతూ హీరోయిన్ చేసిన హీరోయిన్ మాత్రం తక్కువ అనే చెప్పాలి, మరి తమన్ ఇచ్చే అవకాశం తో పూర్తిగా సింగర్ గా మారిపోతుందో లేక పాట వద్దు నటనే ముద్దు అంటుందో చూడాలి మరి.

Related News