//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తండ్రి అండలేకుండా అల్లు అర్జున్ ని ఊహించగలమా..... !

Category : movies

అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. డాన్స్ లోనైనా , యాక్టింగ్ లోనైనా తనకి తానే చాటి అని నిరూపించుకున్నాడు. తన స్టైలిష్ పెరఫామెన్స్ తో టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు దాదాపుగా మంచి విజయాల్ని అందుకున్నాయి.

గంగోత్రి తో ప్రారంభం అయిన అల్లు అర్జున్ కెరియర్ తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్థాయి కి చేరుకున్నాడు. సినిమా సినిమా కి తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుంటూ అభిమానులని పెంచుకుంటూ టాప్ ప్లేస్ కి దూసుకుపోతున్నాడు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ ఎప్పుడు లేనివిధంగా ఘోర పరాజయాలని చూస్తున్నాడు. వరుసగా తాను చేసిన డీజే ...నా పేరు సూర్య సినిమాలు అట్టర్ ప్లాప్స్ గా మిగిలాయి.

చెప్పుకోవాల్సి వస్తే ఎవరికీ నచ్చని సినిమాలని కూడా యావరేజ్ చేయటం , యావరేజ్ గా నిలిచిన సినిమాలని హిట్ లుగా మార్చటం లాంటి కార్యక్రమాలని అల్లు అరవింద్ కంఫౌండ్ ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చారు . ఇక సోషల్ మీడియా లో అయితే అల్లు అర్జున్ ఇప్పటివరకు కూడా ముందు వరుసలోనే ఉన్నాడు. తన సినిమా ప్రారంభం నుండి రిలీజ్ అయ్యి వచ్చే టాక్ వరకు కి రోల్ గా ఈ సోషల్ మీడియా టీం వ్యవహరిస్తారు.

వీళ్ళు పాజిటివ్ రివ్యూ కోసం ప్రత్యేకించి కొంతమంది వారి వర్గానికి చెందిన పి ఆర్ లు చాల కష్ట పడుతుంటారు తమ బాస్ కోసం. ఇక్కడ మేము చెప్పుకొచ్చేది ఏమిటంటే అల్లు అర్జున్ మంచి నటుడు కాదనో కాదు అయన తెలుగు ఇండస్ట్రీ లో ఒక మంచి నటుడు . కానీ అయన కూడా తన తండ్రి సపోర్ట్ తో మధ్య మధ్య లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాటి నుండి బయటపడ్డాడు.