స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఎంపిక విషయం లో చాల జాగ్రత్తలు వహిస్తున్నాడు. అందుకు కారణం తన ముందు చిత్రం దారుణంగా విఫలమవ్వటమే. వక్కంతం వంశి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. Allu Arjun in a Tamil Remake
ఈ మూవీ బన్నీ అభిమానులను కూడా బాగా నిరాశపరిచింది. దీంతో తన తరువాత సినిమా చేయటానికి చాలా కథలు విన్న అల్లు అర్జున్ చివరకి త్రివిక్రమ్ తో మూవీ ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అది కన్ఫర్మ్ అయ్యి అవకాశాలు గట్టిగానే ఉన్నాయ్. అయితే తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ ఒక తమిళ్ రీమేక్ లో నటించడానికి బాగా ఆశక్తి చుపిస్తున్నాడట. ఆ మూవీ రైట్స్ ని కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడు. దిల్ రాజు కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. Allu Arjun in a Tamil Remake
దాంతో ఈ తమిళ రీమేక్ తో మళ్ళీ సాలిడ్ కొట్టి ఫామ్ లోకి రావాలని ఇటు దిల్ రాజు , అటు బన్నీ చూస్తున్నారు. తమిళం లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన చిత్రం 96 . ఈ మూవీ దసరా కి రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మధ్య కలంలో వచ్చిన విభిన్న చిత్రాల్లో ఒకటిగా పేరందుకుంది ఈ చిత్రం. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం చాలా హార్ట్ టచింగ్ గా ఉండడంతో ఈ మూవీ పై బన్నీ మనసు పడ్డాడట. త్రివిక్రమ్ సినిమా తరువాత ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.Allu Arjun in a Tamil Remake