//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి పిల్ల‌ని ఇచ్చిన మామ ఎవ‌రో తెలుసా..?

Category : movies

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాపుసామాజిక వ‌ర్గానికి చెందినా.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన స్నేహా రెడ్డిని పెళ్ళి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స్నేహ‌రెడ్డి ఎవ‌రి కూతురో అనే చ‌ర్చ‌లు తాజాగా సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్నాయి. ఇక అసలు మ్యాట‌ర్‌లోకి వెళితే బ‌న్నికి పిల్లనిచ్చిన మామ పేరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయ‌న రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయనకు పలు విద్యాసంస్థలున్నాయి. అంతేకాదు.. టీఆర్ఎస్ రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు సంపాదించ‌డ‌మే కాకుండా... కేసీఆర్, కేటీఆర్ లకు సన్నిహితుడు.

ఆ చొరవతోనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ లకు ప్రభుత్వ పరంగా ఏ అవసరం వచ్చినా మామ చంద్రశేఖర్ రెడ్డి ముందుండి తీరుస్తాడట.. అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లకు అనుమతులు సహా వివిధ వేడుకలకు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి చొరవతీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పిస్తాడు. అంతేకాదు.. మామ చెప్పాడని ఓ సారి అల్లు అర్జున్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.. విద్యావేత్తగా విశేష సేవలందిస్తున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. విద్యా ప్రమాణాలు పెంచుతూ పేదలకు ఉచితంగా చదువులు చెప్పడంతో పాటు మంచి విలువైన విద్యాసేవలకు గాను ఈ అవార్డు దక్కింది. ఇలా రాజకీయంగా, సినిమాల పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతూ బ‌న్నీ మామ దూసుకుపోతున్నారని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.