//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

allu aravind movies : అల్లు అరవింద్ సినిమాలు : allu aravind family photos geeta arts

Category : editorial

అల్లు అరవింద్ తెలుగు సినిమా నిర్మాత.జనవరి 10 1949 లో జన్మించాడు.ఈయన స్వస్థలం పాలకొల్లు తల్లితండ్రులు పద్మశ్రీ అల్లురామలింగయ్య,కనకరత్నం . భార్య నిర్మల .వీరికి ముగ్గురు కుమారులు అల్లు అర్జున్,అల్లు వెంకటేష్,అల్లు శిరీష్.ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లుఅర్జున్ టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు.

ఈయన గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు.ఈయన తెలుగు ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు.ఈయన తీసిన మగధీర సినిమా టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.అప్పటి వరకు వున్నటాలీవుడ్ లెక్కలని తిరగ రాసింది.

చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అల్లుఅరవింద్ క్రియాశీలంగా పనిచేసాడు.తరువాత కూడా అయన బడా సినిమా లను నిర్మిస్తూ టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా సాగిపోతున్నాడు.

ప్రెజెంట్ ఉన్న పరిస్థితులను చూస్తే టాలీవుడ్ ట్రెండ్ మారుతుందా అని డౌట్ రాక మానదు. ఇంతకు ముందు వరకు ఉన్న రెగ్యులర్ స్టోరీస్ పక్కన పెట్టేస్తున్నట్టు ఉన్నారు ఫిలిం మేకర్స్. 'బాహుబలి' సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కి షాక్ అయ్యారు. ఇదే తరహా కధలకు ఇంపార్టెంట్ ఇస్తూ పురాణ ఇతిహాసాల మీద ఫోకస్ పెట్టారు ఫిలిం మేకర్స్.

వెండితెర మీద 'రామాయణం' వంటి మహా కావ్యాలను చూపించాలంటే ఒక ఛాలెంజ్. అలాగే 'మహాభారతం' కూడా అంతే. ఇప్పటివరకు ఇలాంటి కావ్యాలను టివి సీరియల్స్ రూపంలో చూశామే తప్పించి వెండితెరపై అద్భుతమైన గ్రాఫిక్స్ పరిజ్ఞానంతో ఒక హాలీవుడ్ సినిమా తరహాలో చూడలేదు.

అందుకే ఇప్పుడు 'అల్లు అరవింద్' 'రామాయణ' మహాకావ్యాన్ని తెరకెక్కించడానికి కంకణం కట్టుకున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ కి కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టాలని మాత్రమే ప్రస్తుతానికి ఫిక్సయ్యారు. ఓ రెండు భాగాలుగా 'సంపూర్ణ రామాయణాన్ని' సినిమాగా తీయాలని అల్లు అరవింద్, మధు మంతె, నమిత్ మల్హోత్రా నిర్ణయించుకున్నారట.

స్వయంగా అరవిందే ఈ విషయాన్ని ఒక ముంబయ్ మీడియా వారికి ప్రకటించారు. అయితే ఇది మేజర్ గా హిందీ సినిమా అని లోకల్ భాషల్లోకి డబ్ చేస్తారని కొందరు అంటుంటే, తన కొడుకు 'అల్లు అర్జున్' తో వీరాంజనేయుడి వేషం వేయించే ఛాన్సుందని ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కథలో కథనం అండ్ విజువల్స్ చాలా ముఖ్యం. అసలు డైరక్టర్ ఎవరు హీరో ఎవరు, క్యాస్టింగ్ ఎవరెవరు, అనే విషయాలు తెలిస్తేనే ఈ ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వచ్చేది.