//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణకు 34 శాతం.. ఏపీకి 66శాతo

Category : national

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. బోర్డు ఛైర్మన్‌ శ్రీవాస్తవ అధ్యక్షతన సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 330 టీఎంసీల నుంచి కృష్ణా బోర్డు ఈ కేటాయింపులు జరిపింది. ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34శాతం చొప్పున జలాలను కేటాయించారు. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, సభ్యుడు వెంకట సుబ్బయ్య, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌ఎసీ వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు.

నీటి నష్టాల లెక్కింపుపై ఉపసంఘం నీటి నష్టాల లెక్కింపుపై ఉపసంఘం ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు, బోర్డు సభ్యులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నట్టు శ్రీవాస్తవ వెల్లడించారు. పోతిరెడ్డిపాడు టెలీమెట్రీలో ఎలాంటి సమస్య లేదన్నారు. త్వరలోనే రెండో దశ టెలీమెట్రీలు ఏర్పాటుచేస్తామన్నారు. వర్కింగ్ మాన్యువల్‌పై తెలంగాణ కొన్ని అభ్యంతరాలు చెప్పిందని తెలిపారు. తాగునీటి వినియోగం 20శాతంగానే లెక్కించాలనే అంశంతో పాటు టీఎంసీల మధ్య ఉన్న అంతరం, నాగార్జునసాగర్ ఎడమకాలువ నష్టాలపై బోర్డు అధ్యయనం చేయనుంది. చిన్ననీటి వనరుల అంశంపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. రెండో దశ టెలిమెట్రీ స్టేషన్‌ల జాబితాను సోమవారం నాటికి ఇవ్వాలని ఏపీకి బోర్డు సూచించింది. ఉమ్మడి ప్రాజెక్టుల సిబ్బందిని బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు తెలంగాణ అంగీకరించలేదు. దీంతో వర్కింగ్ మాన్యువల్‌ను ఇరు రాష్ట్రాలకు మళ్లీ పంపనుంది.

Related News