//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయ అరంగేట్రం పై క్లారిటీ ఇచ్చిన అలీ....పార్టీ ఎదో తెలుసా...!

Category : politics movies

ఏపీ రాజకీయాలలో వచ్చే సార్వత్రిక ఎన్నికలల్లో సినిమా కీలక నటులు కూడా తమ అదృష్టాన్ని చుకోనున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రముఖ నటులు రాజకీయ పార్టీలల్లో చేరారు. ఇంకా కొంత మంది ఏ పార్టీ లో చేరబోతున్నది స్పష్టం చేయలేదు.

అటువంటి వారి జాభితా లో ప్రముఖ కమెడియన్ అలీ ముందు వరుస లో ఉంటాడు. అలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అత్యంత ప్రియ మిత్రుడు. త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్టు వస్తున్న వార్తలపై ప్రముఖ సినీ నటుడు అలీ స్పందించారు.

అలీ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మసునూరి వరప్రసాద్ పెళ్లితో ఓ ఇంటి వాడయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్రు శివారులోని జొన్నాడవారి పేటలో శుక్రవారం జరిగిన వరప్రసాద్ వివాహానికి అలీ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా.. రాజకీయ అరంగేట్రం ఎప్పుడని విలేకరులు అలీని ప్రశ్నించారు. స్పందించిన అలీ మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని చెబుతానన్నారు. మరోవైపు పెళ్లికి అలీ హాజరు కావడంతో ఆ ప్రాంతం మొత్తం ఎంతో సందడిగా మారిపోయింది. అలీతో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు.