అమ్మాయిలు మద్యం తాగడం అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. కుటుంబ కలహాలు..పార్టీ సంస్కృతి వంటివి పెరిగిపోవడంతో మద్యానికి అమ్మాయిలు ఎక్కువగా బానిసలుగా మారిపోతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు తల్లి తండ్రుల ప్రవర్తన కూడా దీనికి కారణంగా మారుతుంది. అలాంటి వారికి షాక్ ఇచ్చారు లయోలా మేరీమౌంట్ యూనివర్సిటీ ప్రతినిధులు.
తాజాగా వారు ఒక సర్వే నిర్వహించారు. మద్యం ఎక్కువగా తాగే టీనేజ్ అమ్మాయిల్లో ఎముకలు పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉందని... వెన్నుముకనూ దెబ్బతీస్తుందని అల్కహాల్ అండ్ డ్రగ్స్ స్టడీస్ అనే జర్నల్లో ప్రచురించిన సర్వేలో తెలిపారు. వాస్తవానికి 18-20 ఏళ్ల వయస్సులో ఎముకలు పటిష్ఠ పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మద్యం అదే పనిగా తాగితే ప్రతికూల ప్రభావం పడుతుందని... యువతులు ఎక్కువగా మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు.