ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ రాసిన ఓ లేఖ.. వేలంలో భారీ ధర దక్కించుకుంది. సాదాసీదా కాగితంపై రాసిన రెండు పేజీల గాడ్ లెటర్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ వేలం వేయగా అనూహ్యంగా 2.89 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 20కోట్లు) ధర పలికింది.
మరణానికి ఏడాది ముందు 1954 జనవరి 3న ఆయన ఈలేఖ రాశారు. మ తం, దేవుడు అనే అంశాలపై తన అ భిప్రాయాలను, తాత్విక ఆలోచనల ను ఐన్‌స్టీన్ అందులో రాశారు. జర్మనీ తత్వవేత్త ఎరిక్ గుట్కైండ్ తాను రాసిన చూజ్ లైఫ్- ది బిబ్లికల్ కాల్ టు రివోల్ట్ పుస్తకం పంపగా, దాన్ని చదివి ఐన్‌స్టీన్ ఈ లేఖ రాశారు. నాకు దేవుడు అనే పదం ఓ వ్యక్తీకరణే. అది మనుషుల బలహీనత నుంచి ఉత్పన్నమైంది.
బైబిల్ ఆదరణీయ వ్యక్తుల సమాహారమైనా దాన్ని ప్రాచీన పురాణాల్లాగే చూడాలి అని ఆ లేఖలో ఉంది. యూదుమతమూ మూఢ నమ్మకమేనన్నారు. నిత్యజీవితంలో జోక్యం చేసుకునే మానవ రూప దేవుడిని తాను నమ్మనని ప్రకటించిన 17వ శతాబ్దపు డచ్ తాత్వికుడు బారుచ్ స్పినోజా తనకు ఆరాధనీయుడన్నారు.