Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్షయ తృతీయ పూజా విధానం ఈ మంత్రం పటిస్తే అష్ట ఐశ్వర్యాలు ఖాయం...

Category : editorial history

అక్షయ తృతీయ ఈ రోజు లక్ష్మి దేవి అనుగ్రహం కోసం మనం కుబేర లక్ష్మి దేవి పూజ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది . ఈ పూజా విధానం ఎలా చేయాలో మనం తెలుసుకుందాము. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజామందిరంలో శుభ్రం చేసి ఒక పీట తీసుకొని దానికి బొట్టు పెట్టి కింద పసుపు బియ్యం ఏర్పాటు చేయాలి. అందులో బియ్యం వేసి దానిపై కలశం పెట్టి దీపాన్ని వెలిగించాలి పసుపు తో వినాయకుడిని తయారు చేసి కొత్త వస్త్రాలు బంగారు ఆభరణాలు కలశంపై ఉంచాలి.ప్రసాదానికి చక్కెర పొంగలి పాలతో తయారుచేసిన నైవేద్యం ఉండాలి కుబేర లక్ష్మి మంత్రాన్ని పఠించడం వల్ల మనకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది దీంతోపాటు ‘ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః’ మంత్రం కూడా జపించాలి. మంత్రం జపిస్తూ ఉంటే ఈ రోజు అమ్మవారి కృప కటాక్షాలు మనమీద కలుగుతాయి .అక్షయ పాత్ర అంటే ఇంట్లో ఎంత మంది అతిథులు మన ఇంటికి వచ్చిన వారికి కావలసినంత ఆహారం ఇస్తూ ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు అధినేత శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి .అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మిని వివాహమాడింది శ్రీ వారు ఈ వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా మనం జరుపుకుంటాం .

నారద పురాణం ఎం చెబుతుంది ఏంటి ఈ శుభదినాన ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తాలు ఉండవు మొత్తం శుభకార్యాలు జరుపుకోవచ్చు అని చెపుతుంది. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం కూడా మాత్రమే మనకు కనబడుతుంది చార్ధామ్ యాత్రలో కూడా చలికాలం తర్వాత తిరిగి ఆలయాన్ని తీర్చేది అక్షయ తృతీయ నాడు శ్రీ చిత్ర పూరీలో జగన్నాథ రథ నిర్మాణానికి అంకురార్పణ .

ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి మేర దానధర్మాలు చేయాలి కొందరు ఈ రోజు వైశాఖ పూజ చేస్తారు ఉపశమనం కలిగించే మజ్జిగ పానకం చెప్పులు గొడుగుదానం చేస్తారు ఈ పుణ్య దినాన ఎవరి గొంతు తడిపిన ఎవరికైనా దానం చేసిన ఫలితం అక్షయ్ అవుతుంది.ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు వాళ్లకి పుణ్యం ప్రాప్తిస్తుందని మన గ్రంధాలు తెలుపుతున్నాయి.

Related News