Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్షయ్ కుమార్ ‘కేసరి’ అరాచకం....మూడు రోజుల్లోనే వంద కోట్ల షేర్.

Category : movies

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏ సినిమా చేసిన అందులో ఏ పాత్ర పోషించిన తనదైన నటనతో మెప్పిస్తాడు ఈ స్టార్ హీరో. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆయనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ నటుడు. తాజాగా ఆయన హీరోగా , పరిణీతి చోప్రా హీరోయిన్ గా ..... అనురాగ్ సింగ్ దర్శకత్వంలో ‘కేసరి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలు చేయడం లో దిట్ట అయినా అక్షయ్ ఇలాంటి స్టోరీ చేయడం కాస్త కొత్తే అనుకోవాలి.

‘కేసరి’ సినిమా కథ విషయానికొస్తే...1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ఈ చిత్రం తెరకెక్కింది.. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దాన్నే ఇపుడు కేసరిగా తెరకెక్కించారు.21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ సినిమా స్టోరీ.అంటే ఆ లెక్కన ఒక్కో సిక్కు జవాను..సుమారుగా 476 మందిని చంపారన్న మాట. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి’ సినిమాను ట్రైలర్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది.అయితే ఈ సినిమాలో అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు అక్షయ్. ‘కేసరి’ అంటే త్యాగానికి గుర్తు.

ఇన్ని అంచనాల నడుమ రిలీజ్ అయినా ఈ సినిమా ....మార్నింగ్ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు కావోస్తు ఉండడం తో ....ఈ మూడు రోజుల్లోనే దాదాపు 78 కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈ సోమవారానికి 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు 21 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా అదే ఊపులో బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగిన సినిమాలు ఏవి లేకపోవడం వలన, ఈ సినిమా వసూళ్ల జోరు కొన్ని రోజుల పాటు ఇదే విధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ లెక్కన ‘కేసరి’ బాలీవుడ్ లో ఇంకెలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.

Related News