//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపిని భయపెడుతున్న అఖిలేష్ యాదవ్

Category : national politics

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి సంచలన ప్రకటన చేసారు. బిజెపి పై పోరులో భాగంగా బిఎస్పితో పొత్తు కోసం తను ఎంత వరకు అయినా వెళ్తానని చెప్పారు. తాజాగా మాట్లాడిన ఆయన ‘‘బీఎస్పీతో మా పార్టీ పొత్తు కొనసాగుతుంది. 2019 ఎన్నికల్లో ఒకవేళ మేము కొన్ని సీట్లు వదిలిపెట్టాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నాం. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తాం..’’ అని పేర్కొన్నారు.

‘‘ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు పాకిస్తాన్, చైనా మనకంటే చాలా వెనకబడి ఉండేవి. కానీ చైనా ఇప్పుడు మనపై చాలా ఆధిక్యం సంపాదించింది..’’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటి చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం గోరక్పూర్ స్థానాన్ని గెలుచుకున్న ఈ పార్టీలు ఇటీవల కైరానా స్థానాన్ని కూడా గెలుచుకుని బిజెపిని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో విజయవంతమయ్యాయి.