//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూ 20 కోట్లు పంపిణికి రూ 15 కోట్లు ఖర్చు పెట్టిన అఖిలేష్

Category : national

ప్రభుత్వాలు వివిధ వర్గాల ప్రజల కోసం చేబడుతున్న సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారుల అభ్యున్నతి కోసం కన్నా అధికార పక్షం ప్రచారం కోసమే ఎక్కువగా ద్రుష్టి సారిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం.  ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ ప్రభుత్వం ఆ విధంగా ప్రజాధనాన్ని దుర్వియోగం చేసిన తీరుతెన్నులు ఇప్పుడు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద రూ 20.58 కోట్లు పంపిణి చేయడం కోసం ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ ప్రభుత్వం 2012 నుండి 2013 లలో రూ 15.06 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ అంశాన్ని శాసన సభలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక వెల్లడి చేసింది.

కాగ్ నివేదిక ప్రకారం ఈ కార్యక్రమాలలో సీటింగ్, అల్పాహారాలు, ఇతర ఏర్పాట్ల కోసం రూ 8,07 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక లబ్ధిదారులను ఈ కార్యక్రమాలకు తీసుకు రావడం కోసం మరో రూ 6.99 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవానికి ఈ పధకం మార్గదర్శక సూత్రాలలో కార్యక్రమాల ఏర్పాటు, లబ్ధిదారుల రవాణా వంటి వాటి ప్రస్తావనే లేదు. 1.26 లక్షల మంది  యువతకు చెక్ లను పంపిణి చేశారు. చాలావరకు అఖిలేష్ స్వయంగా పాల్గొని చెక్ లను అందజేశారు. 

గతంలో 2003-2007 ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 30 నుండి 40 ఏళ్ళ మధ్య వయస్సులో ఉన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ 1,000 చొప్పున భృతి చెల్లించడం చేపట్టారు. తాను అధికారమలోకి వచ్చిన తరువాత అఖిలేష్ ఈ పధకాన్ని పునరుద్ధరించారు.