//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వెంకీతో అఖిల్....!

Category : movies

అఖిల్ హీరోగ నిలతోక్కుకోవటానికి చాల ప్రయత్నిస్తున్నాడు అన్నా విషయం తెలిసిందే. అఖిల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అఖిల్,ఇటీవల హలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు,ఈ చిత్రం కూడా అఖిల్ కి సక్సెస్ ఇవ్వ లేకపోయింది.ఐతే ఈ చిత్రంలో అఖిల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఈ చిత్రం లో అఖిల్ మరింత అందంగ కనిపించిన సంగతి తెలిసిందే.ఇపుడు అభిమానుల ఆశలన్ని తన తదుపరి చిత్రంపైనే.తాజాగా 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరితో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన వినిపించిన కథకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు.అయితే కొరటాల శివతో చేసే ఛాన్స్ కూడా ఉందనే టాక్ వచ్చింది.

ఈ క్రమంలో అఖిల్ ఎవరితో చేస్తాడా అనే సందిగ్ధం ఏర్పడింది. తన తదుపరి సినిమాకి దర్శకుడిగా,వెంకీ అట్లూరినే ఎంపిక చేసుకున్నాడనేది తాజా సమాచారం.ఈ చిత్రంతో ఐనా అఖిల్ హిట్ కొడతాడా లేదో చూడాలి.త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.