ప్రస్తుతం టెలికాం సంస్థల మధ్య డేటా వార్ నడుస్తున్న నేపథ్యంలో ఎయిర్టెల్ తన వినియోగదారులకు మరో భారీ ఆఫర్ తీసుకొచ్చింది.
వచ్చే 3 నెలల పాటు తన పోస్ట్‌పెయిడ్ చందాదారులకు ఉచిత డేటాను అందించనున్నట్లుగా తెలిపింది. 'మై ఎయిర్టెల్' యాప్‌ను లాగిన్ కావడం ద్వారా నెలకు 10 జీబీ చొప్పున మూడు నెలల పాటు 30జీబీ డేటాను పొందవచ్చని సంస్థ తెలిపింది. వచ్చే మూడు నెలలు ఉచిత డేటాను ఆనందించండని భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ చందాదారులకు పంపిన ఒక ఈ-మెయిల్ సందేశంలో పేర్కొన్నారు.