జియోకి షాక్ ఇచ్చేందుకు ఎయిర్టెల్ రెడీ అయింది.
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఇంటర్నెట్ ఆధారిత స్ట్రీమింగ్ సర్వీస్‌తో పనిచేసే ఎయిర్టెల్ ఇంటర్నెట్ టీవీని విడుదల చేసింది.సెటాప్ బాక్స్ లతో మరో సంచలనానికి తెరతీయాలని చూస్తున్న రిలయన్స్ జియో కంటే ముందస్తుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తన ఇంటర్నెట్ టీవీ సెట్ టాప్ బాక్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఇంటర్నెట్ టీవీ వాయిస్ రికాగ్నైజేషన్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఎయిర్టెల్ సెట్ టాప్ బాక్స్ ఏ టీవీనైనా స్మార్ట్ టీవీగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ నుంచి ఏ కంటెంట్ నైనా యూజర్లు తిలకించవచ్చు.
ప్రత్యేకంగా అమెజాన్‌లో మాత్రమే లభ్యమయ్యే ఆండ్రాయిడ్‌తో కూడిన ఎస్టీబీ ధర రూ.4,999. అలాగే రూ. 7999 చెల్లించడం ద్వారా ఏడాది పాటు ఎయిర్టెల్ ఇంటర్నెట్ టీవీ కనెక్షన్ పొందవచ్చు.దీంతో పాటు ఎయిర్టెల్ కష్టమర్లు మై హోమ్ లో లాగిన్ అయి మై ఎయిర్టెల్ యాప్ ద్వారా 25 జిబి అడిషనల్ డేటాను పొందవచ్చు ఇది బ్రాడ్ బాండ్ యూజర్లకు మాత్రమే.దీని వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి గేమ్స్‌ను డౌన్లోడు చేసుకొని ఆడుకోవచ్చు.యూట్యూబ్ వీడియోలను ఇందులో చూసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇతరిత్రా యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎస్టీబీని కొనుగోలు చేసే తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మరింత అధికంగా డేటా కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది.