//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Category : national

జియో టెలికాం రంగంలోకి అడుగు పెట్టాక ఇతర టెలికాం సంస్థలు వెనకబడ్డాయి అనే చెప్పాలి.ఐతే ఎయిర్టెల్ ఇప్పుడు జియో కి ధీటుగా ఆఫర్ ను ప్రారంభించి సంచలనం రేపుతోంది.వివరాలలోకి వెళ్తే,

ఎయిర్‌టెల్ కూడా జియోకు దీటుగా ఆఫర్లను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇందులో భాగంగా,రూ.9 రీఛార్జ్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఒక్కరోజు కాలపరిమితితో ఈ ఆఫర్‌ను లాంచ్ చేసింది. యూజర్లు మై ఎయిర్‌టెల్ యాప్, ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా కొత్త ప్లాన్‌ను పొందవచ్చు. కాంబో ఆఫర్ విభాగంలో ఈ రీచార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంటుంది.

రిలయెన్స్ జియో రూ.19 ప్లాన్‌కు పోటీగా అతి తక్కువ రీఛార్జ్‌ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద.. రూ.9తో రీఛార్జ్ చేసుకున్నవారు... రోజులో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 100 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. రోజులో గరిష్ఠంగా.. 250 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. ఎయిర్‌టెల్ మరిన్ని ప్లాన్లను ప్రవేశ పెట్టే యోచనలో ఉంది.