జియో దెబ్బకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ గతంలో సర్ప్రైజ్ ఆఫర్‌ను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర్‌టెల్‌కు చెందిన పోస్ట్‌పెయిడ్ యూజర్లు నెలకు 10 జీబీ డేటా చొప్పున మొత్తం 3 నెలలకు గాను 30 జీబీ 4జీ/3జీ డేటాను పొందారు. తరువాత ఈ ఆఫర్‌ను ఎయిర్టెల్ మరో నెల పొడిగించింది. అయితే ప్రస్తుతం ఇదే ఆఫర్‌ను మరో 3 నెలల పాటు ఎయిర్టెల్ పొడిగిస్తున్నది. దీనికి మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్ అని పేరు పెట్టింది. అయితే ఈ ఆఫర్‌ను ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు జూలై 1 తరువాత మై ఎయిర్టెల్ యాప్‌లో క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారికి మరో 3 నెలల పాటు నెలకు 10 జీబీ చొప్పున మొత్తం 30 జీబీ 4జీ/3జీ డేటా లభిస్తుంది. మాన్సూన్ ఆఫర్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌తో కలిపి మొత్తం 3 నెలల వరకు ఉంటుంది.