టెలికాం రంగంలో జియో అన్ని నెట్వర్క్ లకు కొరకరాని కొయ్య అయ్యింది జియో. జియో పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఆయా నెట్వర్క్స్ ఏవో ఒక ఆఫర్లను ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా ఎయిర్టెల్ కొన్ని కొత్త ప్లాన్స్‌ని ప్రకటించింది. రూ.299తో రీచార్జ్ చేసుకుంటే అన్ని కనెక్షన్లకు 680 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్, 600 ఎంబీ 4జీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. రూ.399 రీచార్జ్‌తో 765 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్, 1 జీబీ డేటా అందుకోవచ్చని తెలిపింది. ఈ రెండు రీచార్జ్‌లతో ఉచిత రోమింగ్ ఇన్ కమింగ్ కాల్స్ ఆఫర్లు కూడా ప్రకటించింది. ఇక అవుట్ గోయింగ్ లోకల్ కాల్స్ కు నిమిషానికి 80 పైసలకి, ఎస్టీడీ కాల్స్ నిమిషానికి 1.15 పైసలకి పొందవచ్చని పేర్కొంది. ఎయిర్టెల్ ఇప్పటికే ప్రకటించిన రూ.499 ప్లాన్‌కి అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్, 3జీబీ 4జీ డేటాను పొందవచ్చని చెప్పింది.