//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నారీ శక్తిని చాటే ఎయిర్ ఇండియా నిర్ణయం ఇదే

Category : world

అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. ఒక నేల మీదే కాదు నింగిలో సైతం దూసుకుపోయే సత్తా మాది అని మహిళలు ముందుకు వెళుతున్నారు. వైమానిక రంగంలో మహిళా లోకం పురుషులతో పోటీ పడుతోంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిర్ ఇండియా మహిళల్లో స్ఫూర్తి నింపడానికి, ఎయిర్ ఇండియాకు మహిళలు సేవలందిస్తున్న తీరు అందరికీ తెలిసేలా వినూత్న కార్యక్రమం చేపట్టింది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అని, అటు వైమానిక రంగంలోనూ మహిళలు తమదైన శైలిలో సత్తా చాటుతున్నారని చూపించాలనుకున్న ఎయిర్ ఇండియా మహిళా దినోత్సవ స్పెషల్ గా నేడు పూర్తి సేవలను మహిళలతోనే అందించనుంది.

ఢిల్లీ నుండి సిడ్నీకి, ముంబై నుండి లండన్ కు, ఢిల్లీ నుండి రోమ్ కు , ఢిల్లీ నుండి లండన్ కు, ముంబై నుండి ఢిల్లీ మరియు షాంగై లకు, ఢిల్లీ నుండి ప్యారిస్ కు, ముంబై నుండి న్యూ ఇయర్ కు రెండు సర్వీసులు, ఢిల్లీ నుండి న్యూయార్క్ కు, ఢిల్లీ నుండి వాషింగ్టన్ కు, ఢిల్లీ నుండి చికాగోకు, ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కు 12 ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను మహిళలు నడపనున్నారు. ఇది నారీ శక్తికి నిదర్శనం అని ఎయిర్ ఇండియా ప్రకటించింది. 12 అంతర్జాతీయ, 40కి పైగా దేశీయ విమానాలను మహిళా సిబ్బందితోనే నడుపుతామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. పైలట్లు కూడా మహిళలే ఉంటారని తెలిపింది. బీ787, బీ777 విమానాలు కూడా ఈ సేవలు అందిస్తాయని వెల్లడించింది.

Related News