వణకడానికి అదేమన్నా మనిషా.. లేకపోతే ఇదేమన్నా చలికాలమా? అని మీరే అనుకోకండి. ఎందుకంటే నిజంగానే విమానం వణికింది. ఒక్క నిమిషం కాదు..రెండు నిమిషాలు కాదు..ఏకంగా 90 నిమిషాల పాటు ప్రయాణం మధ్యలో.. గాలిలో వాషింగ్ మిషిన్ లా షేక్ అయింది ఓ విమానం. ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నఎయిర్ ఏషియా విమానం అది. ఇక.. విమానంలో ఉన్న ప్రయాణికులు మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దేవుడిని ప్రార్ధించడం ప్రారంభించారట. విమానం ఎడమ రెక్క లో ఏదో సమస్య రావడంతో అలా విమానం మొత్తం షేక్ అయిందని గుర్తించారు విమాన సిబ్బంది. సమస్య ను సాల్వ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ... అలాగే 90 నిమిషాల పాటు విమానం షేక్ అవుతూనే ఉందట. చివరకు 90 నిమిషాల తర్వాత దానంతట అదే షేక్ అవడం ఆగిపోయిందట. దీంతో ఊపిరి పీల్చుకున్నారట ప్రయాణికులు. ఇక.. విమానం షేక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది.