//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉద్యోగుల కట్టడి కై ఎయిర్‌ ఇండియా కఠిన ఆదేశాలు

Category : business

ఎయిర్‌ ఇండియాను ప్రైవేట్ పరం చేయాలనీ కృత నిశ్చయానికి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగుల నుండి ప్రతిఘటన రాకుండా జాగ్రత్త పడుతున్నది. కఠిన ఆదేశాలతో వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నది.  గతంలో వాజపేయి ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం చేసినా ఉద్యోగుల ప్రతిఘటన కారణంగా వెనుకడుగు వేయవలసి రావడంతో ఇప్పుడు ముందస్తు చర్యలు చేబడుతున్నది. 

​ఎయిర్‌ ఇండియా విక్రయానికి  శరవేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో మాజీ ఉద్యోగులకు హెచ్చరికలు జారీచేసింది. సోషల్ మీడియాలో  మాట్లాడితే  కఠిన చర్యలు తప్పవని ఎయిర్ ఇండియా హెచ్చరించింది.  సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే రిటైర్మెంట్ లాభాలు  ఉపసంహరించుకోవడం వంటి భారీ పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది.  ఈ మేరకు ఉద్యోగులకు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.

ఎయిర్ ఇండియా  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా   ఏడు సంఘాలు ఉద్యమానికి సిద్ధపడుతున‍్న తరుణంలో తాజా ఆదేశాలు జారీ కావడం గమనార్హం. ఎవరైనా ఆందోళనకు  దిగినా, ఎయిర్‌ ఇండియాకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించినా  భారీ పరిణామాలు తప్పవని  స్పష్టం చేసింది. అలాంటి ఉద్యోగులు  రిటైర్మెంట్ లాభాలు  కోల్పోతారని హెచ్చరించింది.

సంస్థకు చెందిన మాజీ ఉద్యోగులు  ఎయిర్‌ ఇండియా ప్రతిష్టకు భంగకరంగా వ్యవహరిస్తున్నారని, దీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని పేర్కొంది.   ఎయిర్ ఇండియా పై ట్విట్టర్, ఫేస్‌బుక్ ,  వాట్సాప్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రతికూల వ్యాఖ్యలు చేసే మాజీ  ఉద్యోగులు   పదవీ విరమణ అనంతరం సౌకర్యాలు కోల్పోతారని  తెలిపింది. ఎయిర్‌ ఇండియా  ఛైర్మన్ ,  మేనేజింగ్ డైరెక్టర్  అశ్వనీ లోహని  సంతకంతో జూన్‌ 21న  అంతర్గత ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎయిర్‌ ఇండియాలో  30 సంవత్సరాల సర్వీసు  తర్వాత పదవీ విరమణ చేసిన ఒక ఉద్యోగి  24 ఉచిత విమాన టిక్కెట్లని పొందవచ్చు, వీటిలో 25 శాతం అంతర్జాతీయ ప్రయాణానికి కూడా ఉపయోగించుకోవచ్చు. వీరికి  ఉచిత విమాన ప్రయాణంతో పాటు మెడికల్‌ ప్యాకేజీ తదితర సదుపాయాలు  కూడా ఉంటాయి.