//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కశ్మీర్ లో జరిగిన హిమపాతంలో ముగ్గురు జవాన్లు మృతి

Category : national

జమ్ము కశ్మీర్ లో లద్ధాఖ్ లో ఎడతెరిపి లేకుండా హిమపాతం జరుగుతోంది. దీంతో బటాలిక్ సెక్టార్ లో ఆర్మీపోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తన్న ఐదుగురు జవాన్లు మంచు గడ్డల క్రింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన సైన్యాధికారులు ఇద్దరు జవాన్లను మాత్రమే సురక్షిత ప్రాంతానికి తరలించగలిగారు. మిగిలిన ముగ్గురు జవాన్లు మంచు గడ్డల క్రిందే అసువులు బాసారు. ఇలాంటి హిమపాతాలు ఆకస్మిక కుండపోత వర్షాల వల్ల కలిగే ఫ్లాష్ వరదలతో అక్కడ విధులు నిర్వహిస్తున్న జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. జనవరి మాసంలోనే ఒక మేజర్ తో సహా 20 మంది జవానులు మరణించారంటే సమస్య ఎంత గంభీరమైందో ఊహించుకోవచ్చు.