//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బంపర్ ఆఫర్.. రూ.99 లకే ప్రయాణం

Category : national

విమానయానం అంటే కలలా భావించే మధ్యతరగతి మరియు దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా నేటి విమాన యాన సంస్థల పుణ్యమా అంటూ విమానం ఎక్కే అవకాశాలు వస్తున్నాయి.

అలాగే విమానయాన రంగం అభివృద్ధికి భారత్‌ వేదికగా మారనుంది ఈ నేపథ్యంలో ప్రాంతీయ వైమానిక అనుసంధానతను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ప్రాధాన్యతను గుర్తించే ప్రభుత్వం 'ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌' (ఉడాన్‌) పథకాన్ని కూడా తీసుకువచ్చింది. తక్కువ ఖర్చుతో సామాన్యులు కూడా విమానయానం అందుబాటులో ఉంచే ఉద్దేశంతో రూపొందించిన ఉడాన్‌ ను ప్రధాని ఇటీవల సిమ్లాలో ప్రారంభించారు.

అయితే వివరాలోకి వెళితే తాజాగా ఎయిర్‌ ఏషియా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. డొమెస్టిక్ వన్ వే టిక్కెట్ బేస్ రేటును రూ.99గా, విదేశాలకు రూ.444గా నిర్ణయించింది. ఈ పరిమితకాల ఆఫర్ టిక్కెట్ల బుకింగ్ ఆదివారం రాత్రి ప్రారంభమైంది. ఈనెల 19న ముగుస్తుంది. అయితే, ఈ ఆఫర్ టిక్కెట్లను సంస్థ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే బుక్ చేసుకునే వీలుంటుంది. అంతేకాదు, ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్ల ద్వారా వచ్చే ఏడాది మే నుంచి జనవరి 2019 మధ్యకాలంలో మాత్రమే ప్రయాణించవచ్చు.

బేస్ రేటుతోపాటు అదనపు చార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, విమాన టిక్కెట్ ధరలో ఇంధన సర్‌చార్జీ, ఎయిర్‌పోర్టు ఫీజు, పన్నులు, ఇతర చార్జీలదే అధిక వాటా. ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్ల ద్వారా ఎయిర్‌ఏషియా జాయింట్ వెంచర్ సంస్థలకు చెందిన ఏ విమానాల ద్వారానైనా ప్రయాణించవచ్చని సంస్థ స్పష్టం చేసింది.

దేశీయ మార్గాల్లో హైదరాబాద్, బెంగళూరు, కొచి, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, ఢిల్లీ, గోవా ఇంకా ఇతర నగరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. విదేశీ నగరాల విషయానికొస్తే.. తిరుచి, కొచి, ఢిల్లీ, భువనేశ్వర్, జైపూర్ నుంచి కౌలాలంపూర్‌కు.. ముంబై, కోల్‌కతా నుంచి బాలీకి.. జైపూర్, కోల్‌కతా, కొచి, చెన్నై, బెంగళూరు నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణించవచ్చు. ఆలస్యం చేయకండి మరి మొబైల్ తీయండి బుక్ చేస్కొండి.