//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వయసు 7 .. ఏడాది ఆదాయం 150 కోట్లు ......!

Category : state national

కాలం మారుతుంది అనడానికి ఇదే ఒక నిదర్శనం గా చెప్పవచ్చు . ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగం లో పిల్లలు అతి తక్కువ వయసులోనే పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు . ఏడేళ్ల కుర్రాడు అంటే ఎలా ఉంటాడు.. ‘ఇల్లు పీకి పందిరేస్తాడు’. అల్లరి చేస్తూ.. అటు ఇటు తిరుగుతూ , ఒక్క క్షణం కూడా ఉన్న చోట ఉండడు. తన అల్లరి తట్టులేక అమ్మ ఆట బొమ్మలు ఇస్తే.. వాటి అంతు చూసే వరకు వాటిని వదిలిపెట్టరు ఈ వయసు చిన్న పిల్లలు . బొమ్మలని ఇంటికి తెచ్చిన కొద్ది క్షణాల్లోనే భరతం పట్టే బంగారు కొండలు ఉన్నారు. కానీ ఇలాంటి బొమ్మలతోనే ఆడుకుంటూ మిలియనీర్ అయ్యాడు ఏడేళ్ల బుడతడు. నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూనే రూ.150కోట్లు సంపాదించాడు.

ఇది కేవలం ఒక సంవత్సరంలో సంపాదించింది మాత్రమే. ఇది చదవటానికి మీకు ఆశ్చర్యంగా అనిపించినా , ఇది సత్యం . అసలు విషయానికొస్తే .. అమెరికాకు చెందిన ర్యాన్‌ అనే ఏడేళ్ల చిన్నోడు.. నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడు. మార్కెట్‌లోకి కొత్తగా బొమ్మ వస్తే అది ర్యాన్ ముందు ఉండాల్సిందే. వాటిని తీసుకుని అవి ఎలా పనిచేస్తాయో అందరికీ చెబుతాడు. ఇందు కోసం ఈ బుడతడు 2015లో ‘ర్యాన్‌ టాయ్స్‌ రివ్యూ’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు.

రోజూ చిన్నారుల బొమ్మల వీడియోలు అప్‌లోడ్‌ చేయటం మొదలు పెట్టాడు. అంతే తక్కువ సమయంలో లక్షలమంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. రకరకాల బొమ్మలపై రివ్యూలు ఇస్తుండటంతో తన యూట్యూబ్ ఛానల్ కి యాడ్స్ వచ్చాయి. వాటితోపాటే తన బ్యాంక్ ఖాతాలోకి ఆదాయం కూడా వచ్చి చేరింది. దీంతో ఈ బుడతడు యూట్యూబ్‌ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న వారి జాబితాలో తొలి స్థానం సంపాదించుకున్నాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ గతేడాది విడుదల చేసిన జాబితాలో 8వ స్థానంలో నిలిచిన ర్యాన్‌ ఈసారి తన సంపాదన రెట్టింపు చేసుకుని ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆకట్టుకుంటున్నాడు .అలాగే సాటివారికి ఆదర్శంగా ఉన్నాడు . ఇప్పుడు ఉన్న పరిజ్ణానాన్ని ఉపయోగించుకొని ఏమైనా చేయచ్చు అని నిరూపించాడు .

Related News