//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్ళీ తెరపైకి బాబ్రీ మసీదు కేసు

Category : national editorial

బాబ్రీ మసీద్ కూల్చివేత యావత్ దేశాన్ని కుదిపేస్తున్న ఘటన. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విధ్వంసం కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా చేశారని నమోదైన కేసు ఇంకా కోర్టులో సాగుతూవస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. "పాతికేళ్ళగా సాగుతున్న కేసును 2 ఏళ్ళ కాలంలో విచారణ పూర్తి చేయాలని లక్నోలోని ప్రత్యేక కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా 13 మంది బాబ్రీ మసీదు విధ్వంసానికి కుట్ర పన్నారంటూ సిబిఐ దాఖలు చేసిన అభియోగాలను పునరుద్దరించాలని స్పష్టం చేసింది. కేసులో మరో నిందితుడైన కళ్యాణ్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ హోదాలో ఉండటంతో ప్రస్తుతానికి విచారణ నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. పదవీ కాలం ముగిసిన తరువాత ఆయనను విచారించవచ్చని జస్టిస్ పీసీ ఘోస్, జస్టిస్ నారిమన్ లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ దుర్ఘటన జరిగి 25 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా పరిష్కరించకపోవడంతో ప్రత్యేక కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిబిఐ సుప్రీంను ఆశ్రయించింది. "సిబిఐ వేసిన పిటిషన్ ను అనుమతించమని, కేసులో న్యాయం జరిగేలా ఈ కేసులో రోజువారీ విచారణకు ఆదేశిస్తూ రెండేళ్ల కాలపరిమితిలోపు విషయం తేల్చాలి" అని స్పష్టం చేసింది. అంతేకాకుండా నేటి నుండి నాలుగు వారాల్లోపు విచారణ మొదలయ్యేలా సిబిఐ చర్యలు తీసుకోవాలి. సాక్షులంతా క్రమం తప్పకుండ రోజు కోర్టుకు హాజరవ్వాలని, కేసు పూర్తయేంతవరకు న్యాయమూర్తిని బదిలీచేయవద్దని తేల్చిచెప్పింది.

బాబ్రీ కూల్చివేతకు సంబంధించి నమోదైన కేసులో ఒకటి "గుర్తు తెలియని కరసేవకులు" లక్నో కోర్టులో ఇప్పటికే విచారణ సాగుతుంది. మరొకటి అద్వానీ సహా సీనియర్ నేతలపై రాయబరేలి కోర్టులో జరిగింది. ఇప్పుడు ఈ రెండు కేసులు కలిపి లక్నో కోర్టులోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అద్వాని పై రాయబరేలీలో ఉన్న కేసు లక్నో కోర్టుకు తరలించడం పై అద్వానీ తరుపు సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ "కేసును తరలించడం వలన తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని" చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. బాబ్రీ కూల్చివేత జరిగి ఇప్పటికి పాతికేల్లు గడిచిపోయాయి. ఇప్పుడు అద్వానీ, జోషిలు తమ ప్రాథమిక హక్కుల గురించి మాకూ గుర్తుచేసున్నారు" అని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాలన్నిటిని తమ రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ద్వారా లభించిన అధికారాన్ని ఉపయోగించి తీసుకున్నామని ధర్మాసనం ప్రకటించింది.

బాబ్రీ కూల్చివేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారు, నేరం రుజువైతే కనిష్టంగా రెండేళ్లు... గరిష్టంగా ఐదేళ్లు వరకు జైలుశిక్ష పడే అవకాశముంది. మతం పేరిట రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం, జాతి సమగ్రతను దెబ్బతీయటం, భారతీ శిక్షాస్మృతిని ధిక్కరించారంటూ ప్రకటనలు ఇవ్వటం తదితర అభియోగాల కింద వీరిపై విచారణ జరగనుంది.

1) ఎల్ కె అద్వాని

2) మురళీ మనోహర్ జోషి

3) ఉమా భారతీ

4) వినయ్ కతియార్

5) చంపత్ రాయ్ బన్సాల్

6) సతీష్ ప్రధాన్

7) ధరమ్ థాస్

8) మహంత్ నృత్య గోపాల్ దాస్

9) మహా మండలేశ్వర్ జగదీశ్ ముని

10) రామ్ విలాస్ వేదాంతి

11) వైకుంద్ లాల్ శర్మ

12) సతీశ్ చంద్ర నగర్

13) సాధ్వి రితంబర