//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున రెడ్డి తొలగింపుకై మరోమారు యత్నం

Category : national

ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్ట్ న్యాయమూర్తి సివి నాగార్జున రెడ్డి ని ఆ పదవి నుండి తొలగించాలని రాజ్యసభ సభ్యులు మరోమారు ప్రయత్నం చేస్తున్నారు. గత డిసెంబర్ లో చాలామంది సభ్యులు ఈ విషయమై నోటీసు  ఇచ్చినా, వారిలో కొందరు తర్వాత వెనుకడుగు వేయడంతో ఫలించలేదు. ఇప్పుడు తాజాగా 54 మంది సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కి నోటీసు ఇచ్చారు. 

నాగార్జున రెడ్డి దళిత వర్గానికి చెందిన ఒక జూనియర్ జడ్జి ని కులంపేరుతో దూషించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయంకు మించిన ఆస్తులను సమకూర్చుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నోటీసు పై సంతకం చేసిన యంపీలలో టిడిపి, టి.ఆర్.యస్, కాంగ్రెస్, సమాజవాది పార్టీ, సిపియం తదితర పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారు. జడ్జీల (విచారణ ) చట్టం, 1968 ప్రకారం ఆ న్యాయమూర్తిపై తగు చర్య తీసుకోవడానికి తగిన ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. 

రాయచోటిలో జూనియర్ దళిత్ జడ్జి యస్ రామకృష్ణ నిర్వయించే న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడంతో పాటు కులం పేరుతో దుర్భషలాడటం, భౌతిక దాడికి పాల్పడటం చేశారని వారు ఆరోపించారు. తన అక్రమ డిమాండ్ లను నెరవేర్చలేదని జూనియర్ జడ్జి ని వేధించారని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్ ఈ నోటీసు ను సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి అభిప్రాయం కోసం పంపినట్లు తెలుస్తున్నది.