//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బోఫార్ తర్వాత 30 ఏళ్లకు భారత్ కు అమెరికా గన్స్ ఎం777

Category : national

మూడు దశాబ్దాల క్రితం వెలుగులోకి వచ్చిన బోఫర్స్ కుంభకోణం అనంతరం భారత సైన్యంలో తుపాకుల ఆధునికత దాదాపుగా స్తంభించి పోయింది. ఆ తరువాత మొట్టమొదటిగా  భార‌త సైన్యం అమ్ముల‌పొదికి అమెరికాకు చెందిన యుద్ధ ఆయుధాలు ఎం777 అల్ట్రా లైట్ ఆర్టిల్ల‌రి తుపాకులు చేరనున్నాయి. మొత్తం రెండు ఎం777 యుద్ధ తుపాక‌లు భార‌త్‌కు శుక్రవారం వ‌స్తున్న‌ట్లు సైనిక అధికారులు తెలిపారు 

అమెరికాకు చెందిన బీఏఈ సిస్ట‌మ్స్ వీటిని అభివృద్ధి చేస్తున్న‌ది. భార‌త సైన్యం మొత్తం 145 ఆర్టిల‌రీ గ‌న్స్ కొనుగోలు చేసేందుకు అమెరికాతో 770 మిలియన్ డాలర్ల వ్యయం కాగల ఒప్పందం కుదుర్చుకున్న‌ది. షెడ్యూల్ కంటే నెల రోజులు ముందుగానే ఈ ఆయుధాలు వ‌స్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. 

చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతాలైన‌ అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ల‌డాక్ లాంటి ఎత్తైన  ప్రాంతాల్లో ఎం777 ఆల్ట్రా లైట్ తుపాకులను మోహ‌రించనున్న‌ట్లు అధికారులు తెలిపారు. మొత్తం 145 తుపాకులకు కాను బీఏఈ సంస్థ 25 తుపాకులను సరఫరా చేయనున్నది.  మ‌రో 120 తుపాకులను  భార‌త్‌లోనే అసంబిల్ చేస్తారు. హ‌ర్యానాలోని ఫ‌రిదాబాద్‌లో ఉన్న మ‌హీంద్రా డిఫెన్స్ ప్లాంట్‌లో వీటిని అసంబిల్ చేయ‌నున్నారు.