//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మొదటిసారిగా ఐపీఎల్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు

Category : sports

క్రికెట్ ప్రేమికులకు ఎంతో వినోదాన్ని పంచే ఐపీఎల్-10 మహాసంగ్రామం మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది.సగటు ప్రేక్షకుడు తమతమ అభిమాన క్రికెటర్లు పంచే వినోదాన్ని చూసిమురిశిపోయేందుకు ఎంతగా ఎదురుచూస్తున్నాడో ,అదేవిధంగా ఆటగాళ్లుకూడా అభిమానులకు వినోదాన్ని పంచేందుకు ,ప్రత్యర్థి వ్యూహాలను దెబ్బతీసి విజేతలుగా నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.ఐపీఎల్ లో ఆడేందుకు వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఇప్పటికే తమ దేశం తరుపున ఆడుతున్న టోర్నీలను ముగించుకొని భారత్ కి చేరుకున్నారు .

ఇక మొదటిసారిగా ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు కూడా భారత్ కి వచ్చేసారు. మొదటిసారిగా ఐపీఎల్ ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా ,ఇద్దర్ని సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్ ) కొనుగోలుచేసింది. దీనితో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్ ) ఆటగాడు మహమ్మద్ నబీ హైదరాబాద్ చేరుకొని జట్టుతో కలిసిపోయాడు.ఐపీఎల్-10 లో ఆడేందుకు తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు నబీ తెలిపాడు . ఐపీఎల్ ను ప్రపంచంలోనే గొప్ప లీగ్ లో ఒకటిగా వారు ఇదివరకే అభివర్ణించారు. నబీ ని ఎస్.ఆర్.హెచ్ రూ.30 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది. తోటి ఆటగాళ్లతో కలిసి శిక్షణలో పాల్గొటున్న నబీ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని, సిరీస్ బాగా రాణించాలని కోరుకుంటున్నన్నాడు . టోర్నీలో భాగంగా ఏప్రిల్ 5 న

సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడనుంది .