రషీద్ ఖాన్ ఆఫ్ఘన్ క్రికెట్ సంచలనం. భారత్ లాంటి అగ్ర జట్లకు ఆడే సామర్ధ్యం ఉన్న ఆటగాడు. ఇతని కొస౦ ఐపియల్ వేలంలో భారి పోరాటమే జరిగింది. చివరికి హైదరాబాద్ జట్టు ఇతనిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆటగాడు పెద్ద మనసు చాటుకున్నాడు.
ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. నాలుగు ఓవర్లు వేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసుకున్న రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆఫ్ఘాన్ ఆటగాళ్లకి మద్దతు ఇస్తున్న అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. విజయం కోసం పోరాడడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్న రషీద్ తాను అందుకున్న మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డును ఆసుపత్రిలో ఉన్న తన స్నేహితుడి కుమారుడికి అంకితం ఇస్తున్నట్టు తెలిపాడు. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదును అతడి ఆసుపత్రి ఖర్చుల కోసం ఇస్తున్నట్టు ప్రకటించాడు. దీనితో అందరు ఒక్కసారిగా ఇతనిని సోషల్ మీడియాల ఆకాశానికి ఎత్తేసారు.