//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టేకాఫ్‌ లో టైర్ పేలిన చెన్నై దిల్లీ విమానం.. తప్పిన ప్రమాదం..!

Category : national

చెన్నై నుంచి దిల్లీకి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.చెన్నైలోని అంర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌ అవుతుండగా రన్‌వే పై విమానం టైరు పేలింది.దీంతో సిబ్బంది విమానం టేకాఫ్‌ నిలిపేసి సురక్షితంగా తిరిగి ల్యాండ్‌ చేశారని,ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ వెల్లడించింది.

విమానం నుంచి అందరినీ సురక్షితంగా దించేసి టెర్మినల్‌ భవనంలోకి పంపించినట్లు వెల్లడించింది.విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.విమానం టైరు పేలిన కారణంగా చెన్నై విమానాశ్రయంలోని ఓ రన్‌వేను సాయంత్రం ఆరు గంటల వరకు మూసేశారు.

ఈరోజే చెన్నై విమానాశ్రయంలో మరో విమానం అత్యవసరంగా ల్యాండయింది.ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కార్గో విమానం ఇంధనం తక్కువగా ఉండడంతో చెన్నై విమానాశ్రయంలో దిగింది.